వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై తాజాగా చీటింగ్ కేసు నమోదు అయింది. ప్రతిమా అనే మహిళకు సంబంధించి స్థలాన్ని అమ్మగా వచ్చిన 32 లక్షల రూపాయలు బాధితరాలకు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడుతూ తనను మోసం చేస్తున్నారని బాధితురాలు గురువారం మధ్యాహ్నం 1:00 సమయంలో ఒకటవ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థలం అమ్మడంలో బొబ్బల శ్రీనివాస్ యాదవ్, ఆయన సతీమణి శోభా సుభాషినిలు మధ్యవర్తులుగా ఉన్నారన్నారనీ వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.