కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం ఎద్దుల దొడ్డిలో పిచ్చ కుక్క దాడిలో నలుగురికి తీవ్ర గాయాలు కావడం జరిగింది అని గురువారం రాత్రి 7 గంటల సమయంలో తెలిపారు. పిచ్చికుక్క ఒకేసారిగా గ్రామంలో ఉన్న నలుగురిపై దాడి చేయడంతో భయాందోళన చెందిన గ్రామస్తులు నలుగురిని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అధికారులు గ్రామంలో పిచ్చి కుక్కలను తరలించాలంటూ గ్రామస్తులు కోరారు.