ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న ఆర్టీసీ హాస్పటల్ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం వెలుగు చూసింది. బస్టాండ్ ఆవరణలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎవరు అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు అయితే మృతుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని కొందరి ద్వారా తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుని చేపట్టారు మృతుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణమేంటి ఆ ప్రదేశంలోకి ఎలా వెళ్లాడు అనేటువంటి కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.