ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు బోర్ ఆపరేటర్ హసీనా పైన కొందరు మహిళలు దాడి చేశారని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హసీనా మాట్లాడుతూ పట్టణంలోని 35 వ వార్డు నందు సాగర్ నీరు వస్తున్నాడంతో బోర్ ఆపడానికి వెళ్ళిన తనపై కొందరు మహిళలు దాడి చేశారన్నారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సంబంధిత మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని బోర్ ఆపరేటర్లు మున్సిపల్ కార్యాలయం నందు నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. వారిపై చర్యలు తీసుకోకపోతే ర్యాలీలు నీటి సరఫరా నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.