కర్నూలులో 730 గణేష్ విగ్రహాల నిమజ్జనం సంధర్భంగా (గురువారం) సెప్టెంబర్ 4 న జిల్లా పోలీసుశాఖ కట్టుదిట్టమైన భారీ భద్రతా చర్యలు చేపట్టిందని, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఓ ప్రకటనలో తెలిపారు. బందోబస్తు విధులలో అడిషనల్ ఎస్పీలు, 12 మంది డిఎస్పీలు, 72 మంది సిఐలు మరియు ఆర్ ఐలు , 146 మంది ఎస్సైలు, 412 మంది ఎఎస్సై మరియు హెడ్ కానిస్టేబుల్స్ , 718 మంది పోలీసు కానిస్టేబుల్స్ , 14 ఎఆర్ సెక్షన్లు, 34 మంది మహిళా పోలీసులు, 17 స్పెషల్ పార్టీ