ప్రజలకు మరింత మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు కొత్త అంబులెన్సులు కేటాయించడం జరిగిందని, అందులో భాగంగా తొలి విడత గా మూడు అంబులెన్స్ లు రావడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కే వెంకటేశ్వర్రావు తెలియ చేశారు.సోమవారం కలెక్టరేట్ ఆవరణలో మూడు అంబులెన్స్ లకు జెండా ఊపి ప్రారంభించారు. వీరిని జిల్లాలో 3 నియోజకవర్గాలకు కేటాయించినట్లు తెలిపారు.