కడపజిల్లా పులివెందుల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లను ప్రవేట్ పరం చేస్తున్న నేపథ్యంలో అందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పులివెందుల మెడికల్ కాలేజీ దగ్గర నిరసన తెలిపి,హాస్పిటల్ సూపరింటెండెంట్ అధికారి శ్రీనివాసురావు కి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి,పులివెందుల నియోజకవర్గం ఇంచార్జి ధ్రువకుమార్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం అందజేశారు.