రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వైసీపీ శ్రేణులకు మొదటి వర్ధంతి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్రపురం లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపు వెన్నుపోటు దినోత్సవం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ఎస్సీ ఎస్టీ పథకాలు తీసేసి బలహీన వర్గాలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేకనే ఇలా ప్రవర్తిస్తున్నారని మంత్రి సుభాష్ ఎద్దేవా చేశారు