విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో ఆదివారం మాట్లాడారు. ఎన్నికల ముందు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని చెప్పిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ నేడు ప్రైవేటీకరణ ప్రక్రియ జరుగుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును కాపాడాలని కోరారు.