దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట పట్టణ కేంద్రంలో సాయిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 3 ట్రాక్టర్ల గడ్డి, ఒక ట్రాక్టర్ సొప్పను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. స్థానికుల సహాయంతో విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో పూర్తిగా గడ్డివాము, సొప్ప కాలి బూడిదయింది.