వినాయక చవితి పండుగ మరియు గణేష్ నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతలు కాపాడే లక్ష్యంతో బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు శుక్రవారం సాయంత్రం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు రౌడీ షీటర్లతో సమావేశమై, పండుగ సందర్భంలో ఎవరైనా గొడవలు సృష్టించినా, నేరపూరిత చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జరుపుకోవాలి. ఎవరైనా నేరాల్లో పాల్పడితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.