విధులలో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్ట్ డాక్టర్ల జీతాలలో కోత విధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం మహదేవ్ పూర్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగుల హాజరు పట్టికను తనికి చేసి వైద్యులతో మాట్లాడారు. ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని, జనరల్ వార్డును, బ్లెడ్ స్టోరేజ్ యూనిట్ ను తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవల గ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంత మంది కాంట్రాక్ట్ వైద్యులు విధులకు హాజరు కాకుండా జీత భత్యాలు పొందుతున్నట్లు గుర్తించిన జిల్లా కలెక్టర్ అలాంటి వారి జీతాలలో కోతలు