Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 26, 2025
క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని రంపచోడవరం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం అన్నారు.రాజవొమ్మంగి గిరిజన సంక్షేమ పాఠశాలను రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ సిబ్బంది ఉన్నారు.