Araku Valley, Alluri Sitharama Raju | Aug 30, 2025
పాడేరు మండలం ఈదులపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనఖి నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. విశ్వేశ్వర నాయుడు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గ్రామాలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు పి.హెచ్.సిలో జరుపుచున్న సుఖప్రసవాల గురించి వైద్యాధికారికి అడిగి తెలుసుకున్నారు. పి హెచ్ సి పరిధిలో నమోదయిన మలేరియా కేసుల గూర్చి, అందించిన చికిత్సల గురించి వైద్యాధికారికి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎపిడమిక్ సీజన్లో వైద్య సిబ్బంది గ్రామస్థాయిలో సందర్శించి సకాలంలో రోగులను గుర్తించి వైద్య సేవలు అందించవలసిందిగా ఆదేశించారు.