శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో ఉపాధి హామీ పథకం పనులపై సామాజిక తనిఖీ కార్య క్రమం గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. పనుల్లో అవినీతి జరిగిందా లేదా అన్న విషయాలను వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. అయితే, ప్రజల భాగస్వామ్యం లేకపోవడంతో అసలు ఉద్దేశం నెరవేరలేదని కొందరు విమర్శించారు.