శ్రీకాళహస్తిలో శాస్త్రోక్తంగా లక్ష్మీగణపతి హోమం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా విజ్ఞానగిరి వద్ద ఉన్న గణపతి మండపంలో లక్ష్మీగణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు పాల్గొని పూజలు చేశారు. పూర్ణాహుతి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ప్రభుత్వానికి గణపతి ఆశీస్సులు కలగాలని ఎమ్మెల్యే కోరుకున్నారు.