జగిత్యాల జిల్లా బాస్కెట్ బాల్ జూనియర్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించబడునని అసోసియేషన్ కార్యదర్శి డా. వేణు గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జూలై 3వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు స్థానిక స్వామి వివేకానంద మినీ స్టేడియం లో ఎంపిక పోటీలు జరుగునని. ఇందులో ఎంపిక అయినవారు గద్వాల జిల్లా ఉత్తవకార్ లో 11 నుండి 13 వరకు జరుగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్ బాస్కెట్ బాల్ టోర్నమ్ ట్ లో పాల్గొంటారని తెలిపారు. ఎంపిక లో పాల్గొనే క్రీడాకారులు - ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ తీసుకొని రాగలరని. పుట్టిన తేదీ 1జనవరి 2007 తరువాత పుట్టిన అర్హులని తెలిపారు ఆసక్తి గలవారు. హాజరుకావాలని కోరారు.