సంగారెడ్డి జిల్లా వరప్రదాయని సింగూరు ప్రాజెక్టుకు 20095 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరినట్లు ప్రాజెక్టు అధికారి జాన్ స్టాలిన్ గురువారం సాయంత్రం తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17 టీఎంసీల వద్ద జలాలు ఉన్నట్లు తెలిపారు.