యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్డి నాయక్ తండాలో నిర్వహించిన అమ్మకు భరోసా కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం గర్భిణీ పల్లవి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గర్భధారణ సమయంలో తీసుకోవలసిన ఆహారం జాగ్రత్తల గురించి వివరించిన ఆయన పల్లకి న్యూట్రిషన్ కిట్టును అందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం వల్ల ఆరోగ్యం మెరుగు పడడంతో పాటు అనవసర ఖర్చులు తగ్గుతాయని తెలిపారు.