మధిర మండలంలో కురిసిన వర్షం ప్రజలకు, రైతులకు ఉపశమనం కలిగించింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడిన జనాలకు వర్షం ఊరటనిచ్చింది. ఎండలకు వాడిపోతున్న పత్తి పంటలకు ఈ వర్షం ప్రాణం పోసినట్లు అయిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి.