కాకినాడ, ఆగస్ట్ 25: “మన తెలుగు భాషకు గొప్ప చరిత్ర ఉంది. ఇది మన సంస్కృతి, సాహిత్యం, సంప్రదాయాలకు ప్రతీక. ఈ భాష నిలిచి ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి” అని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అన్నారు. తెలుగు భాషా పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుంటోందని ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయంపై దృష్టి సారించారని సానా పేర్కొన్నారు. సోమవారం కాకినాడ ఐడియల్ కళాశాలలో డాక్టర్ పి చిరంజీవి కుమారి స్మారకంగా నిర్వహించిన తెలుగు భాషా ఉత్సవాల్లో భాగంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరి