ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరానికి కృష్ణ, గోదావరి జలాలను వినియోగించుకుంటూ సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డిప్యూటీ సీఎం,భట్టి విక్రమార్క మల్లు మధిర, ఎర్రుపాలెం మండలాలకు సాగునీరు అందించేందుకు 630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకం పనులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు వాకాటి శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్ట రాగమయి లతో కలిసి శంకుస్థాపన చేశారు.