విద్యార్థులు సోషల్ మీడియా, ఇంటర్నెట్ వంటి వాటికి దూరంగా ఉండి, చదువుపై దృష్టి పెట్టాలని మైదుకూరు సీఐ రమణారెడ్డి అన్నారు. గురువారం వనిపెంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగం గురించి అవగాహన కల్పించారు. ఇంటర్నెట్ ద్వారా మంచి ఎంతో చెడు కూడా ఎక్కువగా ఉంటుందని, మంచిని స్వీకరించి చెడువాటికి దూరంగా ఉండాలని సూచించారు. చదువుపై దృష్టి పెట్టి ముందుకెళ్లాలన్నారు.