మంత్రాలయం : మండలంలోని రాంపురం గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో శుక్రవారం వినాయక నిమజ్జనం సందర్భంగా మొసలి కలకలం రేపింది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లగా, నదిలో మొసలి కనిపించడంతో నిర్వాహకులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. మొసలి గుర్తు తెలియని శవాన్ని మింగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నదిలో నిమజ్జనం చేసేవారు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.