నంద్యాల జిల్లా మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి గురువారం ప్రజలకు గణేష్ నిమజ్జన వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తెలుగు గంగా ప్రధాన కాలువ, కేసీ కెనాల్లో నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్నందున నిమజ్జన సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మద్యం మత్తులో అల్లర్లు చేయరాదని, విగ్రహాల ఎత్తు కారణంగా కరెంట్ వైర్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.