ప్రతీ ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని, యోగా ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత మెరుగుపడుతుందని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యాగార్డెన్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి యోగా కాంపిటేషన్ కు శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు ప్రదర్శించిన యోగ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్ననాటి నుండే యోగను అభ్యసించినట్లయితే అనేక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఇందులో యోగా శిక్షకురాలు అన్నపూర్ణ, జగన్నాథం, నందనక్రుపాకర్, రాంరెడ్డి, ప్రభాకర్, ప్రవీణ్, సునీత్, ప్రవీన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.