భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం 11 గంటలకు పత్రికప్రకటన విడుదల చేశారు జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఈ సందర్భంగా ఆయన పలు వివరాలు వెల్లడించారు ఈ నెల 13న జరగనున్న జాతీయలోక్ అదాలత్ లో జిల్లాలో వివిధ కేసుల్లో ఉన్నవారు రాజీ కుదుర్చుకొని కేసుల నుంచి విముక్తి పొందాలన్నారు. క్రిమినల్ కాంపౌండింగ్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ పరమైన కేసులు, బ్యాంకు రికవరీజ్ విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వైవాహిక జీవితం సంబంధించిన కేసులు ఉన్నవారు రాజీ కుదుర్చుకొని లోక్ అదాలత్ ద్వారా కేసుల నుంచి విముక్తి పొందాలన్నారు.