ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం... జనగామకు చెందిన కానుగంటి మనీశ్ (23) తన స్నేహితులతో కలిసి నేడు ఆదివారం మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం స్నేహితులతో జంపన్న వాగులో దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో మునిగి గల్లంతయ్యారు. గల్లంతైన మనీశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.