మురమళ్ల - పల్లంకురు ఏటి గట్టుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇరిగేషన్ కార్యాలయం నుంచి మురమళ్ల వైపు వెళ్తున్న ఐరన్ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్పై ఉన్న వ్యక్తిపై ఇనుప సామాగ్రి పడటంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.