నంద్యాల జిల్లా ప్యాపిలి మండల గుడిపాడు గ్రామంలో గురువారం పొలం పనుల సమయంలో బుడ్డల మిషన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ప్యాపిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.