Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 23, 2025
చింతూరు మండలంలో ఏడుగురాళ్లపల్లి వద్ద శుక్రవారం అర్ధరాత్రి భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సుపై జరిగిన రాళ్ల దాడి సంఘటనపై చింతూరు పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు త్వరలోనే ఈ యొక్క కేసులో నిందితులు పట్టుకుంటామని చింతూరు పోలీసులు పేర్కొన్నారు