సంగారెడ్డిలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో స్టూడెంట్ వాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ పాఠశాలల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులను పాఠశాలలకు అనుమతించడం లేదని, బకాయిలు చెల్లించకపోతే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.