జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో తెలంగాణ సాంస్కృతిక సారథి (జగిత్యాల) కళాబృందంచే పారిశుద్ధ్య నిర్వహణ మరియు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. మండలంలోని లక్ష్మీపూర్,భీమరాజు పల్లి,రంగదాముని పల్లి గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతికసారథి కళాబృందం వారు తమ అట పాటల ద్వారా అవగాహన కలిపించారు.ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడాలని చూచించారు. గ్రామాల్లో యువత గంజాయి మరియు డ్రగ్స్ కు బానిసై తమ విలువైన భావిషత్తును నాశనం చేసుకుంటున్నారని.యువత మత్తుకు బానిస కాకుండా సమాజంలో గౌరవంగా బతకాలని,నలుగురికి ఆదర్శంగా నిలవాలన్నారు.