కండ్లకోయలోని సంజనా కోర్టు యార్డులో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. పెద్దలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొని క్రికెట్ ఆడారు. ఫోటో యాడ్ చైర్మన్ ప్రభాకర్ గౌడ్ కూడా క్రికెట్ ఆడి అందరిని ఉత్సాహపరిచారు. గెలిచిన జట్టుకు ఆయన బహుమతులు అందజేశారు.