ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం కొనిజర్ల పోలీస్ స్టేషన్ నుండి, పల్లిపాడు గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడడంతో, వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్లో పూర్తిస్థాయిలో నీళ్లు నిలవడంతో వాహనాలు గుంతలో పడి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. కారు టూవీలర్ వంటి వాహనాలకు వాహనదారులకు మరింత ఇబ్బందికరంగా మారి ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఉంటుందని ఎటువంటి ప్రాణ నష్టం జరగకముందే ఆర్ అండ్ బి అధికారులు తక్షణమే గుంతలు పూడ్చాలని స్థానికులు పేర్కొంటున్నారు