Araku Valley, Alluri Sitharama Raju | Aug 31, 2025
ఆంధ్ర ఒడిస్సా ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యు త్కేందంలో సరైన నిర్వహణ లేక పోవడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సుమారు 70 సంవత్సరాలుగా ఏక బిగిన విద్యుత్తు ఉత్పాదన కోసం నీటిని చేరవేసే పవర్ కెనాల్ కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఫలితంగా ఎక్కడపడితే అక్కడ రంధ్రాలు పడుతున్నాయి. డుడుమ జలాశయం పవర్ గేట్లుద్వారా నీటిని విడుదల చేసే ప్రాంతంలో కెనాల్కు చెందిన రిటై నింగ్ గోడకు 8 అడుగుల రంధ్రం పడింది. డుడుమ జలాశయంలో 8 స్పిల్వే గేట్లలో నాలుగే పనిచేస్తు న్నాయి. అధికారులు జల విద్యుత్ కేంద్రం నిర్వహణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.