హైదరాబాద్ జిల్లా: దొంగ ఓట్లను ఈసీ బయటపెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని హైదరాబాద్ జిల్లా నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఫిరోజ్ ఖాన్ మంగళవారం అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్లో పవర్ ప్రజెంటేషన్ నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలో కూడా దొంగ ఓట్లు చలామణి అవుతున్నాయని ఆరోపించారు. దీనిని ఈసీ సీరియస్గా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లపై పోరాడుతుందని స్పష్టం చేశారు. దొంగ ఓట్లు బయటపెట్టేందుకు తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.