సోన్ మండలంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆస్ట్రానమీ ల్యాబ్ ను రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖల మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం సాయంత్రం సందర్శించారు.ల్యాబ్‌లో విద్యార్థులకు అంతరిక్షంపై అవగాహన కలిగించేలా ఏర్పాటు చేసిన పరికరాలు, నమూనాలను మంత్రి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రశ్నలతో పరీక్షిస్తూ, వారు చూపిన పరిజ్ఞానాన్ని అభినందించారు. ఇలాంటి ల్యాబ్‌లు జిల్లాలో విద్యార్థుల శాస్త్రీయ దృష్టి విస్తరించడానికి తోడ్పడతాయని, భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు ఖగోళ శాస్త్రం వైపు