శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని పాడి రైతులు బుధవారం మధ్యాహ్నం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా పశువులకు ఏదైనా జబ్బు చేస్తే ఆసుపత్రికి వస్తున్నామని ఇక్కడ కాంపౌండర్ తప్ప వైద్యులు ఎవరు ఉంటున్నారు కూడా మాకు తెలియడం లేదు అన్నారు. పశువులకు జబ్బులు చేస్తే ఇక్కడికే తీసుకొస్తున్నామని వైద్యుల సలహాలు సూచనలు తెలుసుకుందామనుకుంటే ఒక్కరోజు కూడా ఇక్కడ ఎవరు అందుబాటులోకి రావడం లేదన్నారు.