ఆదిలాబాద్ లోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ రామాలయం ఆవరణలో ఆదర్శ దుర్గ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని కోలాటం ద్వారా మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బతుకమ్మకు పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ దంపతులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. పండగలను ఘనంగా జరుపుకోవాలని ఎస్పీ సూచించారు.