గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామానికి చెందిన వన్నూరుసాబ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. గురువారం సాయంత్రం బైక్ పై స్వగ్రామానికి వెళుతుండగా పులకుంట వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా స్థానికులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.