నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం అవస లోని పల్లి గ్రామంలో ఆదివారం 10:30 గంటల సమయంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు అవసరమైన యూరియా, డి ఏ పి ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సరఫరా చేయాలని అన్నారు. యూరియా డి ఏ పి లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇకనైన ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులకు యూరియాను సరఫరా చేయాలని కోరారు. రేపు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.