బెల్లంపల్లి ఏరియాలోని తిర్యాణి మండలం ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ లో శనివారం అర్ధరాత్రి పులి సంచారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. ఖైరిగుడ ఓపెన్ కాస్ట్లోని చెక్ పోస్ట్ వద్ద పులి కదలికలను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పులి సంచార సమయంలో బయట ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పులి సంచారంపై ఫారెస్ట్ అధికారులు స్పందించాల్సి ఉందన్నారు.