ఆలూరులో రాష్ట్ర హోం మంత్రి అయిత పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఆలూరులో కేసు నమోదు అయిందని ఎస్సై మెహబూబ్ భాష బుధవారం వెల్లడించారు. నిన్న ఒకరిని అరెస్టు చేశామని, కోర్టులో నేడు హాజరు పరిచామన్నారు. మరో ఇద్దరిపై కేసు నమోదు చేశామని త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. ఆలూరు కి చెందిన రాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశామన్నారు.