భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఉపాధి, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కత్తి రవి, AITUC జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పుత్తూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద AITUC కార్యదర్శి చంద్రబాబు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కత్తి రవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని దుయ్యబట్టారు.