కామారెడ్డి జిల్లా దోమకొండ శివారులోని గుండ్ల చెరువుకు ఆదివారం గండిపడింది స్థానికులు గమనించి గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం తెలియజేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది చెరువుకు గండిని పుడ్చారు. దీంతో చెరువు కింది ఆయకట్ట రైతులు కృతజ్ఞతలు తెలిపారు. చెరువుకు గండిపడడంతో రైతులతో పోటు ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. చెరువుకు గండి పెద్దగా ఉంటే చాలా ఇబ్బందులకు గురయ్యేదని రైతులు తెలిపారు.