దివ్యాంగులు సమాజంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు. వారికి అండగా నిలవడం మన అందరి బాధ్యత అని రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ అన్నారు. రేణిగుంట లోని అభయక్షేత్రం ను మంగళవారం ఆయన సందర్శించారు. సమాజ సేవ పట్ల తన అంకితభావాన్ని తెలియజేస్తూ అభయక్షేత్రం లోని రోగులకు హాస్పిటల్ ఖర్చులకు స్వంత నిధుల నుంచి 25 వేల రూపాయల విరాళాన్ని అందించారు. ప్రభుత్వం తరఫున వీలైనంత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం దివ్యాంగులను శాలువా కప్పి, పూలదండలతో సత్కరించి వారి పట్ల గౌరవాన్ని వ్యక్తం చేశారు. అనంతరం దివ్యాంగులకు ప్రత్యేకమైన విందు భోజనం ఏర్పాటు చేశారు.