ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల పరిషత్తు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మీర్జా జాఫర్ అలీ బేగుకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ నుండి జాఫర్ అలీ బేగ్ పదోన్నతి పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన జాఫర్ అలీ బేగ్ కు పలువురు అధికారులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.