సఖినేటిపల్లి స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద మంగళవారం తృటిలో ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల మేరకు ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఒక్కసారిగా మలుపు తిరిగి ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకు బస్సు కిందకు దూసుకుపోయింది. బండిపై ఉన్న వ్యక్తి ఒక్కసారిగా పక్కకు దూకేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు