విజయవాడ పటమటలో మద్యం మత్తులో ఇద్దరు సోదరుల మధ్య గొడవ జరిగింది. పంట కాలువ రోడ్డులోని వైన్షాప్ వద్ద మద్యం తాగిన తర్వాత, మాట మాట పెరిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒకరు బీరు సీసాతో కొట్టడంతో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.